Chicken Mutton Fish : చికెన్‌, మ‌ట‌న్, చేప‌లు.. ఈ మూడింటిలో పోష‌కాలు ఎక్కువ‌గా ఎందులో ఉంటాయి.. ఏది తింటే ఎక్కువ మేలు జ‌రుగుతుంది..?

Chicken Mutton Fish : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు త‌దిత‌ర మాంసాహారాల‌ను అధికంగా తింటున్నారు. క‌రోనా కార‌ణంగా వీటిని తినే వారి సంఖ్య పెరిగింది. గ‌తంలో వారంలో ఒక‌సారి మాంసాహారం తినేవారు. కానీ ఇప్పుడు కొంద‌రు వారంలో రెండు సార్లు వీటిని తింటున్నారు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ప్రోటీన్లు అధికంగా ల‌భిస్తాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీంతో క‌రోనా వంటి వైర‌స్‌ల‌తోపాటు బాక్టీరియాల‌ను సైతం ఎదిరించే శ‌క్తి మ‌న శ‌రీరానికి ల‌భిస్తుంది. క‌నుక‌నే మాంసాహారం తింటున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే మ‌న‌కు అనేక ర‌కాల మాంసాహారాలు అందుబాటులో ఉన్నా.. వాటిల్లో చాలా మంది ప్ర‌ధానంగా తినేవి.. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు అని చెప్ప‌వ‌చ్చు. ఇక వీటిల్లో దేంట్లో పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి.. దేన్ని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎక్కువ‌గా లాభాలు క‌లుగుతాయి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మూడింటిలో దేని వ‌ల్ల మ‌న‌కు ఎక్కువ ఫ‌లితం ఉంటుందో తెలుసుకోవాలంటే.. ముందుగా వీటిల్లో పోష‌కాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఇక వీటిలో ఉండే పోష‌కాల విష‌యానికి వ‌స్తే..

100 గ్రాముల చికెన్ ద్వారా మ‌న‌కు 165 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే 31 గ్రాముల ప్రోటీన్లు, 3.6 గ్రాముల కొవ్వులు ల‌భిస్తాయి. దీంతోపాటు చికెన్ లో కొలెస్ట్రాల్‌, సోడియం, పొటాషియం, ఐర‌న్‌, విట‌మిన్ బి6, మెగ్నిషియం, కాల్షియం, విట‌మిన్ బి12 వంటి ఇత‌ర పోష‌కాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

ఇక 100 గ్రాముల మ‌ట‌న్ ద్వారా మ‌న‌కు 294 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. దీంతోపాటు 25 గ్రాముల ప్రోటీన్లు, 9 గ్రాముల కొవ్వులు ల‌భిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్‌, సోడియం, పొటాషియం, ఐర‌న్‌, విట‌మిన్ బి6, మెగ్నిషియం, కాల్షియం, విట‌మిన్ బి12 తదిత‌ర పోష‌కాలు కూడా మ‌ట‌న్‌లో దండిగా ఉంటాయి.

Contact HerbalifeNutrition #Wellnesscoach

Name: Supriya, Mobile No.+918309086091, +917780260880.

Comments

Popular posts from this blog

Plant-Based Protein: A Sustainable Food Staple.

Enhance your flexibility and overall well-being with these invigorating yoga postures!

Superfoods For Thyroid: 7 Foods That You May Add To Your Diet