Bananas : అరటి పండ్లను తిన్న తరువాత నీళ్లను తాగవచ్చా ? తాగితే ఏమవుతుంది ?
Bananas : అరటి పండ్లను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ పండ్లు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. పైగా సామాన్యులకు కూడా తక్కువ ధరలో లభిస్తాయి. కనుక అరటి పండ్లను చాలా మంది కొని తింటుంటారు. అయితే అరటి పండ్లను తినడంలో చాలా మందికి ఒక సందేహం వస్తుంటుంది. అదేమిటంటే..
అరటి పండ్లను తిన్న తరువాత నీళ్లను తాగవచ్చా ? ఒకవేళ ఆ పండ్లను తిన్న తరువాత నీళ్లను తాగితే ఏమవుతుంది ? ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయా ? అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. అయితే దీనికి వైద్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండ్లను తిన్న తరువాత అనారోగ్య సమస్యలు వస్తాయని అనడంలో అర్థం లేదు. అరటి పండ్లను తిన్న తరువాత నీళ్లను తాగవచ్చు. నీళ్లను తాగితేనే మంచిది. ఎందుకంటే అరటి పండ్లలో నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది నీళ్లకు కాస్త విస్తరించినట్లు అవుతుంది. దీంతో పేగుల్లో ఆహారం చురుగ్గా కదులుతుంది. సులభంగా జీర్ణమవుతుంది. దీని వల్ల మలబద్దకం ఉండదు. గ్యాస్, అసిడిటీ కూడా తగ్గుతాయి. దీంతోపాటు శరీర మెటబాలిజం కూడా పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కనుక అరటి పండ్లను తిన్న తరువాత నీళ్లను తాగవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నీళ్లను తాగితేనే ఇంకా మంచిది.. అన్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోండి. అరటి పండ్లను తిన్న తరువాత నీళ్లను తాగితే ఏదో జరగుతుందనే అపోహలు వద్దు. నిర్భయంగా నీళ్లను తాగవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి.
Comments
Post a Comment