health tips: రోజంతా బద్దకంగా అనిపిస్తుందా? ఏ పని చేయాలనిపించట్లేదా? అయితే ఈ ఆహారం తీసుకోండి..

#WeightLoss #WeightGain #BeHealthy #BeFit  help then fill the form
https://surveyheart.com/form/6135c642639548331f3307da

శీతాకాలం (Winter Season) వచ్చిందంటే బద్దకం (Laziness) ఎక్కువగా ఉంటుంది. ఏ పనీ చేయడానికి ఇష్టపడరు. మరోవైపు ఇమ్యునిటీ (Immunity) కూడా మనిషికి చాలా అవసరం. రోగాలు ఎదుర్కోవడానికి మొదటి ఔషధం.

శీతాకాలం (Winter Season) వచ్చిందంటే బద్దకం (Laziness) ఎక్కువగా ఉంటుంది. ఏ పనీ చేయడానికి ఇష్టపడరు. మరోవైపు ఇమ్యునిటీ (Immunity) కూడా మనిషికి చాలా అవసరం. రోగాలు ఎదుర్కోవడానికి మొదటి ఔషధం మన రోగ నిరోధక శక్తినే. బద్దకం ((Laziness) )గా ఉండేవారు, శక్తి (energy) లేనట్లుగా భావించేవారు, ఒత్తిడి (stress), ఆందోళన ఎదుర్కొనే వారు, బి విటమిన్లు ఉన్న ఆహారాలను, విటమిన్ సప్లిమెంట్లను తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఆకుపచ్చని కూరగాయలు (greens), చేపలు (fish), మటన్, చికెన్ (chicken), కోడిగుడ్లు, నట్స్ తదితర ఆహారాల్లో మనకు బి విటమిన్లు లభిస్తాయి.

ఎముకలు (bones), దంతాల సమస్యలున్న వారు విటమిన్ డి, కాల్షియం ఉన్న ఆహారాలను, ట్యాబ్లెట్ల (tablets)ను వాడాలి. రాజ్మా, పాలు, సోయా, చీజ్, బ్రకోలి, పాలకూర, పెరుగు తదితర ఆహారాల్లో మనకు ఇవి రెండూ లభిస్తాయి. శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పులు (pains), వాపులు ఉంటే అలాంటి వారు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటే ఆహారాలను తీసుకోవాలి. చేపలు, పల్లీలు, నట్స్ (nuts), గుమ్మడి విత్తనాలు, ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె (coconut oil), నెయ్యి తదితర ఆహారాల ద్వారా మనకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి.

పిస్తా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కారణం ఇందులో ఉండే అర్జినిన్, విటమిన్ బి 6. ఈ పోషకాలు రక్తం ద్వారా కణాలకు ఆక్సిజన్ తీసుకువెళ్లడానికి సహాయపడతాయి. ఇది రోగనిరోధక వ్యవస్థ (Immunity system),  నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. జీడిపప్పు చాలా రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైనది కూడా. దీనిలో రాగి మరియు ఇనుము (iron) అధికంగా ఉంటుంది, ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, రోగ నిరోధక వ్యవస్థ (Immunity system) ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి జీడిపప్పు గొప్ప స్నాక్ (snack). ఈ గింజల్లో మెగ్నీషియం, జింక్ మరియు ఆక్సిడెంట్లు వంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయి, ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

చర్మ సమస్య (skin problems)లతో బాధపడేవారు విటమిన్ ఎ, సి, ఇ ఉన్న ఆహారాలను, సప్లిమెంట్లను తీసుకోవాలి. ఇవి ఎండ వల్ల కందిన చర్మాన్ని (skin) సంరక్షిస్తాయి. అలాగే పలు ఇతర కారణాల వల్ల వచ్చే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. కోడిగుడ్లు, నట్స్, క్యారెట్లు, నిమ్మకాయ, కివీలు, ద్రాక్ష, ఉసిరికాయ, గుమ్మడివిత్తనాలు, వాల్ నట్స్, అంజీర్, అవకాడో, జీడిపప్పు, పల్లీలు తదితర ఆహారాల్లో మనకు ఈ విటమిన్లు లభిస్తాయి.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

Comments

Popular posts from this blog

Plant-Based Protein: A Sustainable Food Staple.

Enhance your flexibility and overall well-being with these invigorating yoga postures!

Superfoods For Thyroid: 7 Foods That You May Add To Your Diet